ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న ముఖ్య విషయములను తెలుసుకొన వచ్హును
NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Tuesday, January 24, 2012
పిల్లలు నడిపే ఫలహారసాల...ఫోటోలు
ఆంస్టర్డాం లో ఉన్న "కిండర్ కుక్ కఫే" అనే ఫలహారసాలను పిల్లలు నడుపుతున్నారు. పెద్దలు సహాయపడుతున్నా వంట వండేది, సర్వ్ చేసేది,బిల్లు వేసేది మరియూ కడిగే పనులు చేసేది మాత్రం పిల్లలే. ఈ ఫలహారసాలలో మెనూ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ ఫలహారసాలలో తినడానికి రావాలనుకునే వారు ముందుగానే టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి.... కిండర్ కుక్ కఫే అనే ఈ చోట కొంత ఫలహారసాల, కొంత కుక్కింగ్ స్కూల్, కొంత డే కేర్ సెంటర్ గా ఉంటుంది. పనికివెళ్లే తల్లితండ్రులు తమ పిల్లలను ఇక్కడ వదిలి వెల్తారు. ఇక్కడ పిల్లలకు చదువు, వంట మరియూ వండిన ఆహారాన్ని ఎలా సర్వ్ చేయాలీ అనేవి వారికి నేర్పిస్తారు. రాత్రి ఆ పిల్లల తల్లితండ్రులు పిల్లలను తిరిగి తీసుకువెళ్లేటప్పుడు, పిల్లలతో పాటూ వారు కూడా పిల్లలు వందిన ఫలహారాలను తిని వెల్తారు. ఇక్కడ పిల్లలకు రెస్పాన్సిబిలిటీ, హెల్ప్ ఫుల్ నెస్స్, బిహేవియర్ మరియూ సరదాగా ఉండటం అనే వాటిని నేర్పటానికే ఈ స్కూల్.(ఫలహారసాలలో పిల్లలను పెట్టుకుని పనిచేయించుకోవడం కాదు)
పిల్లలు భలె ముద్దుగా వున్నారు .
ReplyDelete