Sunday, September 25, 2016

చమురు ప్లాట్ఫారాల మీద నిర్మించిన మొదటి సముద్ర నగరం....ఫోటోలు

20 వ శతాభ్దం ప్రారంభంలో అజర్‌బైజాన్ దేశ సముద్రతీరంలో సుమారు 30 మైళ్ళ దూరంలో చమురు బావులు ఉన్నట్లు తెలుసుకున్న సోవియట్ రష్యా 1949 లో ఆ చమురు తీయటానికి 300 చదరపు కిలోమీటర్ల కు 2000 బావులను కలుపుతూ చమురు కేంద్ర నిర్మాణం మొదలుపెట్టేరు. 1952 లో నిర్మాణం పూర్తిచేసుకుని 1000 మందికి నివాశంగా మారింది. ఆ తరువాత అన్ని రంగాలూ అభివృద్ధి చెందటంతో ఇప్పుడు అది ఒక పెద్ద నగరంగా మారింది. ఆ నగరమే Neft Dasları.

Friday, September 23, 2016

ఇన్నోవేటివ్ ఆర్కిటెక్చర్ అంటే జపాన్ దేశమే!....ఫోటోలు


మిస్టరీ: మాంత్రీక బావి...ఫోటోలు మరియు వివరాలు

ఎస్టోనియా దేశములో తుహలా అనే గ్రామములో ఉన్నది ఈ మాంత్రీక బావి.

ఎస్టోనియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా. ఉత్తర యూరప్ బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తరాన ఫిన్లాండు, పశ్చిమాన స్వీడెన్, దక్షిణాన లాట్వియా మరియు తూర్పున రష్యా దేశాలు ఎల్లలుగా గలవు.
ఎస్టోనియా దేశములోనే తుహలా అనే ఈ గ్రామములో అత్యధికమైన భూగర్బ బావులు మరియూ నదులు ఉన్నాయి. గత 3000 సంవత్సరాల నుండి తుహలాలో ఉన్న ఈ మాంత్రీక బావి అత్యద్భుత ప్రకృతి వేడుకను చూపుతోంది. 2.5 మీటర్ల లోతు మాత్రమే ఉన్న ఈ బావి నుండి వర్షాకాలములో నీరు పొంగి నదిలాగా ఏర్పడి అక్కడున్న మొత్త ప్రాంతమునూ వరదతో ముంచుతుంది. ప్రతి సంవత్సర వర్షాకాలములోనూ అలా జరగదు. ఏ రెండు, మూడు సంవత్సరాలకో అలా జరుగుతుంది. కేవలం మూడు లేక నాలుగు రోజులు మాత్రమే అలా జరుగుతుంది. అందుకే ఈ బావిని మాంత్రీక బావి అంటారు.
ఈ గ్రామములో నివసించే ప్రజలు దీనికి మాంత్రీక బావి అని పేరుపెట్టేరు. వారి కధల ప్రకారం ఇద్దరు మంత్రగాళ్ళు భూమి క్రింద యుద్దం చేసుకోవటంవలనే ఇలా బావి నుండి నీరు వచ్చి వరదగా ప్రవహిస్తోంది. అప్పుడప్పుడు మేము ఈ బావి మీద రెండు మండుతున్న రూపాలను చూసేమని చెబుతారు. ఇది ఒక మాంత్రీక ప్రదేశం. ఇక్కడ ఉండటం మా అదృష్టం అని చెబుతారు.

నీళ్ళు రానప్పుడు బావి
"ఎస్టోనియా మొత్త ప్రదేశం సహజ మంత్ర శక్తి నిండిన ప్రదేశం. దానిని వివరించడం/వర్ణించడం చాలా కష్టం. కొన్ని సార్లు వివరించకుండా ఉండటమే మంచింది. ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలు చాలావరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి" అక్కడ నివసిస్తున్న 37 సంవత్సరాల Mari-Liis Roos అంటారు.
ఎప్పుడు ఆ బావిలో నుండి నీరు వస్తుందో తెలియదు కాబట్టి, అలా వచ్చినప్పుడు ఎస్టోనియా దేశములో నివసిస్తున్నవారే గబుక్కున ఆ చోటుకు చేరుకోగలరు, ఆ వింతను చూడగలరు. మూడు, నాలుగు రోజులు మాత్రమే ఆ బావి నుండి నీరు పైకి ఉబికి వస్తుంది కాబట్టి బయటి దేశంలో ఉన్నవారు ఆ వింతను చూడటానికి ఆ సమయానికి అక్కడికి చేరుకోలేరు.

17 సంవత్సరాలుగా, అంటే ఎప్పుడైతే సోవియట్ యూనియన్ దగ్గర నుండి స్వాతంత్ర్యం పొందిందో అప్పటి నుండి ప్రపంచములోని లౌకిక దేశాల జబితాలో చోటుచేసుకుంది.

పురాతన నమ్మకాలు జానపద కథల రూపంలో ఉనికిలో ఉన్నాయి. కధల ప్రకారం మానవుల చేసిన పాపాలు ప్రకృతిలో ప్రతిధ్వనిస్తాయి. సరస్సులు ఉన్నట్లుండి మాయమవడం, అడవులు కనబడకుండా పోవడం, అక్కడున్న చెట్లు, మొక్కలు తమని పూజించమని అడగటం జరిగేవట.
తుహలా గ్రామములోని భౌతిక ప్రపంచం ఇటువంటి వివరణలు కోసం అభ్యర్థిస్తుంది. గ్రామం మొత్తం నేల చిన్న చిన్న రంధ్రాలతో ఉంటుంది. 15 బూగర్భ నదులు చిట్టడవిలో పారుతున్న శబ్ధం ఎప్పుడూ వినబడుతునే ఉంటుంది. కానీ కళ్లకు కనిపించదు. ఈ రంద్రాలు ఒక్కొక్కసారి అతిపెద్దవై( ఒక గుర్రమును మింగగలిగేంత) వెంటనే కుచించుకుపోతాయి.

ఇలాంటి వింతలు కలిగిన గ్రామములో అతిముఖ్యమైన వింత ఈ మాంత్రీక బావి. వర్షాలు కురిసిన తరువాత భూగర్భనీరు ఒత్తిడి తట్టుకోలేక పైకి అలా పొంగుకు వస్తున్నాయి అని భూగర్భ శాస్త్రవేత్తలు(జియాలజిస్టులు....భూమి నిర్మాణము, మూలము, పదార్థ స్వభావము మొదలైన అంశాల శాస్త్రీయ అధ్యయనము చేసేవారు) చెబుతున్నారు.
"చుట్టూ ఎన్నో బావులు ఉండంగా, గ్రామం మొత్తం రంద్రాలు ఉండగా, ఎందుకని ఒక్క ఆ బావిలోనుండే నీరు ఉబికి వస్తున్నది. ఆ బావి లోతు 2.5 మీటర్లే ఉన్నది. భూగర్భ జలాలు(వర్షం కురిసినా ఇంకిపోయే) అంతలోతు మాత్రమే ఇంకుతాయా?.....కనీసం మాకు తెలిసి 500 సంవత్సరాల నుండి ఈ బావిని చూడటానికి ప్రజలు వస్తున్నారని మాకు తెలుసు. ఈ మాంత్రీక బావిలోనుండి వచ్చే నీటిని తాగితే జబ్బులను నయం చేస్తుంది. కచ్చితంగా 100 ఏళ్ళు బ్రతుకుతారు. శాస్త్రం ఈ మధ్య వచ్చింది. శాస్త్రవేత్తలు చెప్పేది నిజమనే అనుకుందాం...ఏది గ్రామము క్రింద పారుతున్న 15 నదులను చూపించమనండి" అంటూ జియాలజిస్టులు చెప్పేవాటిని అక్కడి ప్రజలు కొట్టిపారేస్తున్నారు.

"ఎక్కడైనా రోజా పువ్వులను ముక్కలు చేసి వేస్తే, అక్కడ రోజా చెట్లు మొలుస్తాయా?...ఇక్కడ మొలుస్తాయని/మొలిచేవని మా పూర్వీకులు చెప్పేవారు" అని మరొకరు అంటున్నారు.
ఒకప్పుడు ఆ బావి దగ్గర ప్రార్ధనలు చేసేవారు. నేల మీదున్న రంధ్రాల నుండి భూమాతకు తమ కష్టాలు చెప్పుకునేవారు. యుద్దలు మొదలై గ్రామాన్ని వివిధ రకాల ప్రజలు ఆక్రమించుకున్న తరువాత ఇక్కడున్న రంధ్రాలు మామూలు రంధ్రాలుగా, బావిని మామూలు బావిగా చూసేవారు. మళ్ళీ ఇప్పుడు అంటే 2008లో ఒక సారి, తిరిగి 2010 లో ఒకసారి ఆ బావిలో నుండి నీరు రావడంతో ఈ మాంత్రీక బావిని చూడటానికి పర్యాటకులు వస్తున్నారు.

ఈ గ్రామం క్రింద పారుతున్నాయని చెబుతున్న కనిపించని భూగర్భ నదులను సైన్స్ పరంగా నిరూపించేంతవరకు ఇది మిస్టరీగానే మిగిలిపోతుంది.

Thursday, September 22, 2016

యుద్ధజవానుల స్మృతి చిహ్నాలు....ఫోటోలు

చరిత్రవ్యాప్తంగా కొన్నివేల యుద్దాలు జరిగినై, కొన్ని కోట్ల యుద్ధజవానులు తమ దేశాలకోసం ప్రాణత్యాగంచెసేరు. కానీ అతి కొద్దిమందికి మాత్రమే స్మృతి చిహ్నాలు నిర్మించేరు. ఎక్కువ మంది యుద్ధజవానుల అవశేషాలు వారి ఊర్లకు పంపబడి, వారి ఆత్మీయులచే ధహన సంస్కారాలు జరుపబడి వారిచే మాత్రమే జ్ఞాపకం ఉంచుకోబడుతున్నారు. కొన్ని సార్లు యుద్దాలలో బాగా కాలిపోయి, చిన్నాభిన్నమైన శరీరాలను గుర్తు పట్టలేక యుద్ద భూమిలోనే పాతిపెట్టేరు.

మొదటి ప్రపంచ యుద్దం తరువాత ఒక ఉద్యమం మొదలయ్యింది. గుర్తుపట్టలేని, యుద్దభూమిలోనే వదిలేసిన గుర్తుతెలియని దేశంకోసం ప్రాణ త్యాగం చేసిన యుద్ధజవానుల కోసం ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేసి, అక్కడ యుద్దాలలో చనిపోయిన గుర్తు తెలియని జవానులను గౌరవించాలని తీర్మానం తీసుకు వచ్చేరు.

అదే విధముగా పలు దేశాలు తమ దేశాలలో గుర్తుతెలియని, దేశంకోసం ప్రాణ త్యాగం చేసిన యుద్ధజవానుల కోసం ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేసి అక్కడ గుర్తుతెలియని ఒక యుద్ద జవాన్ శరీరం ఉంచి ఆ స్మృతి చిహ్నం దగ్గర గౌరవ పద్దతులు నిర్విహిస్తున్నారు.

భారతదేశంలో ఇండియా గేట్. మిగిలిన దేశాలలో ఎలా ఉన్నాయో చూడండి.

ఇండియా గేట్
అమెరికా
ఇంగ్లాండ్
ఫ్రాన్స్
బెల్జియం
కెనడా
ఈజిప్ట్
ఇరాక్
ఇటాలి
గ్రీస్
రష్యా

Wednesday, September 21, 2016

పులి పిల్లలను తరిమి కొడుతున్న కుక్క పిల్ల....వీడియో


ఫ్రాన్స్ దేశంలోని ఈ రోడ్డు రోజుకు రెండుసార్లు మాయమావుతుంది....ఫోటోలు

ఫ్రాన్స్ దేశంలోని Passage du Gois అనే పేరుగల రోడ్డు రోజుకు రెండుసార్లు మాయమావుతుంది. ఈ రోడ్డు ఫ్రాన్స్ దేశ పశ్చిమ భాగంలో ఉన్న Gulf of Burnёf అనే ప్రాంతానికి Noirmoutier అనే దీవికి మధ్య ఉన్న సముద్ర తీరాన వేసేరు. పెద్ద అలలు వచ్చినప్పుడు ఈ రోడ్డు 13 అడుగుల లోతుకు వెళ్ళిపోతుంది. పెద్ద అలలు రోజుకు రెండుసార్లు వస్తాయట. పెద్ద అలలు ఎప్పుడు రాకుండా ఉంటాయో తెలుసుకుని ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తారట.

Tuesday, September 20, 2016

మిస్టరీ: మాట్లాడే ఆత్మ పలక(బోర్డ్)....ఫోటోలు మరియు వివరాలు

లిపి ఫలకం, ఆత్మ బోర్డ్ మరియు మాట్లాడే పలక అని కూడా చెబుతారు. ఈ పలకను(Ouija board) ఒక ఆట వస్తువుగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ పలక, ఆడుకునే వారు తనని అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుందట. ఈ పలక మార్కెట్లలో అమ్మకానికి ఉన్నా ఈ పలకను కొనుక్కునే వారి సంఖ్య తక్కువగా ఉన్నది. దీనికి కారణం, ఈ పలకను కొనుక్కుని, ఆడుకున్న వారు తమ అనుభవాలను చెప్పటం వలనే. అంటే ఈ పలకతో ఆడినవారు ఆనందం కంటే బాధలే ఎక్కువ పొందేరు. అందులో చాలామంది అత్యంత భయంకరమైన అనుభూతిని ఎదుర్కొన్నారు.
గూగుల్ సంస్థ పోయిన నెల అందించిన సమాచార జాబితాలో ఈ సంవత్సరం ఈ పలకల అమ్మకం ఎక్కువ అయ్యిందని, ఈ పలకను తమ పిల్లలకు, స్నేహితులకు మరియూ కుటుంబీకులకు క్రిస్ట్మస్ కానుకగా ఇవ్వటానికి కొంటున్నారని తెలిపేరు. ఈ పలకల అమ్మకం ఈ సంవత్సరం ఎక్కువ అవటానికి కారణం ఈ సంవత్సరం హాలోవిన్ పండుగకు విడుదలైన ఓయూజా(Ouija) సినిమానే అని తెలిపేరు. ఈ పలకను ఆట వస్తువుగా చూడొద్దని, ఈ పలకతో ఆడుకోవద్దని భూతవైద్యులు మరియు అతీత భావన(పారానార్మల్) పరిశోధకులు ప్రజలకు హెచ్చరికలు జారీచేసేరు.
ఈ పలకకు క్షుద్ర మరియు చెడు పరిణామాలకు సంబంధం ఉన్నదని తెలిసినా, వ్యాపారులు ఈ పలకను ఒక ఆట వస్తువుగా అమ్ముతున్నారని పారానార్మల్ పరిశోధకులు మరియు భూతవైద్యులు వాపోతున్నారు. “ఈ పలకతో ఆత్మలను రప్పించడం సుళువే కానీ పంపించడం మాత్రం కష్టమని వారు చెబుతున్నారు. ఈ పలకతో చనిపోయిన తమ ప్రియమైన వారిని మాత్రమే కలుసు కుంటున్నాము(బోతున్నాము) అనుకుంటున్నారు ఈ అమాయక ప్రజలు. కానీ అది నిజం కాదు. ఆ పలకతో ఆడుతున్నప్పుడు ఎవరి ఆత్మ అయినా రావచ్చు. ఆ ఆత్మ మంచిది కావచ్చు లేక చెడ్డది కావచ్చు” అంటున్నారు.
"ఎవరితో మాట్లాడుతున్నామో తెలియని ఆ పలకను నేనైతే అసలు ముట్టుకోను. ఎందుకంటే ఇన్నేళ్ళ నా సేవలో ఈ పలక వలన నేను ఎన్నో భయాలకు గురి అయ్యేను" అని పారానార్మల్ పరిశోధకుడు డారెన్ ఆన్సెల్ అన్నారు. పారానార్మల్ పరిశోధకుడు డారెన్ ఆన్సెల్ తన బృందంతో కలిసి ఈ మాట్లాడే పలకతో ఎన్నో పరిశోధనలు జరిపేరు. "పలకతో ఆడుకోవటానికి ఉపయోగించే ముక్కోణపు కదిలే సూచిక(planchette) ఆడుతున్న వారి సబ్-కాన్షియస్ మెదడు యొక్క కండరాల కదిలికలవలన కదులుతు ఉండవచ్చు" అని ఆయన చెప్పేరు. కానీ తన పరిశోధనలలో భాగంగా ఈ పలకతో ఆడినవారిని కలుసుకున్నప్పుడు వారు వివరించిన అనుభవాల గురించి నేను వివరించలేను అని తెలిపేరు. ఈ పలకతో ఆడుతున్నప్పుడు అదృశ్య మాటలు, వింత శబ్ధాలు వినబడేవి, ఆడుతున్న రూములో పలక చుట్టూ ఉన్న వస్తువులు ఎగిరిపోవడం లాంటివి జరిగేయని ఈ పలకలతో ఆడుకున్నవారు తెలియపరిచేరు.
ఈ పలక గురించి 1100 AD లో చైనా యొక్క చారిత్రక పత్రాలలో రాయబడి ఉంది. సాంగ్ రాజవంశం వారు ప్రత్యేక ఆచారాలతో ఆధ్యాత్మిక గురువుల పర్యవేక్షణలో ఆత్మల ప్రపంచముతో సంభాషించేవారట.

జూలై-1, 1890 లో ఎలిజా బాండ్ అనే వ్యాపారవేత్త లాభార్జనే లక్ష్యంగా ఈ మాట్లాడే ఆత్మ పలకను ప్రజలకు హానిచేయని ఆట పరికరంగా పరిచయం చేసేడు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికాకు చెందిన ఆధ్యాత్మిక వేత్త పిరల్ ఉర్రన్(Pearl Curran) ఈ పలకను దైవ సంబంధమైన పరికరముగా ప్రాచుర్యంలోకి తెచ్చేరు.
సైన్స్ శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక వేత్త మాటలను కఠినంగా విమర్శించారు. ముక్కోణపు కదిలే సూచిక కదలడానికి కారణం ఆడుతున్నవారి ఇడియోమోటార్ ఎఫక్ట్(ideomotor effect...శక్తివంతమైన భావోద్వేగాలు ఒక మనిషిలో అనుకోకుండా కన్నీళ్ళు తెప్పించడాన్ని ఇడియోమోటార్ ఎఫక్ట్ అంటారు)వలనే కదులుతోందని చెబుతున్నారు.

మాట్లాడే ఆత్మ పలక పై ఆంగ్ల అక్షరాలు చిహ్నిత చేయబడి ఉంటాయి, 0 నుండి 9 వరకు అంకెలు ఉంటాయి. ఎస్, నో మరియు గుడ్ బై అనే మాటలు ఉంటాయి. ముక్కోణపు కదిలే సూచిక ఇవ్వబడుతుంది. ఈ పలకను ఆడటానికి ఇద్దరు కావాలి. మూడో వ్యక్తి కూడా ఆడే చోట ఉండవచ్చు. చిన్న వెలుతురులో ఆడితే సరైన సమాధనం దొరుకుతుంది. ఆడే ఇద్దరూ ముక్కోణపు కదిలే సూచికను ఆ పలకపై ఉంచి ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారో వారిని పిలువ వచ్చు. జవాబుగా ముక్కోణపు కదిలే సూచిక తానుగా కదులుతుంది. అది కదిలి ఏ ఏ అక్షరాలపై ఆగుతుందో దానిని మూడోవ్యక్తి కాగితంపై రాసుకోవచ్చు. ఒక్కొక్క సారి రూములోకి వచ్చిన ఆత్మలు మాట్లాడతాయి. ఆ మాటలను అక్కడున్న అందరూ వినవచ్చు. ఆట ముగిసిన తరువాత ఖచ్చితంగా గుడ్ బై చెప్పాలట. లేక పోతే అక్కడికి వచ్చిన ఆత్మ వెళ్ళిపోకుండా అక్కడే ఉంటుందట.
చాలామంది ఈ పలకను ఆడుతున్నప్పుడు తమకు కావలసిన వారి ఆత్మలు రాకుండా, ఇంకెవరివో ఆత్మలు వస్తున్నాయని, ఆ ఆత్మలు ఆడేవారిని హింసిస్తున్నాయని చెప్పడంతో ఈ పలక ఆట ఆడుకోవడాన్ని తగ్గించేరు. చాలా సంవత్సరాలుగా ఈ మాట్లాడే ఆత్మ పలక అమ్ముడు కాకుండా షాపులలోనే ఉండిపోవడంతో ఈ పలక అమ్మకాలు తగ్గిపోయినై. అప్పుడప్పుడు కొందరు కొని ఆడుతున్నా ఈ పలకకు గిరాకీ తగ్గింది. ఈ మాట్లాడే ఆత్మ పలకను ఆడవద్దు అని ప్రచారం జరుగుతూనే ఉన్నది. కానీ తిరిగి ఈ మధ్య, ముఖ్యంగా ఓయూజా(Ouija) సినిమా కారణంగా అమ్మకాలు పెరిగినట్లు గూగుల్ సంస్థ తెలియజేసింది.

పరిచయం చేయబడి 125 సంవత్సరాలు అయినా మాట్లాడే ఆత్మ పలక గురించి సరైన అవగాహన ఎవరూ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇది ఇంకా మిస్టరీగానే ఉన్నది.